Manchu Manoj: కొంత కాలంగా మంచు ఫ్యామిలో వివాదాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మనోజ్, మంచు విష్ణుకి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటివలే జరిగిన మంచు మనోజ్ పెళ్లికి కూడా అన్న విష్ణు అతిథిలా వచ్చి వెళ్లిపోయినట్లు సమాచారం. అప్పటినుంచి మంచు మనోజ్ ఎప్పుడు ఏ బాంబు పేల్చుతారో అని సోషల్ మీడియా పోస్ట్స్ ను జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మనోజ్ తన అన్నయ్య విష్ణు మీద ఆరోపణ చేస్తూ ఓ వీడియో ఫేస్ బుక్ స్టేటస్ లో పోస్ట్ చేశారు.
Read Also: AP CM Jagan: స్కామ్‌లు తప్ప.. స్కీమ్‌లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
మా వాళ్ళ మీద విష్ణు ఇలానే దాడి చేస్తున్నాడని మనోజ్ పేర్కొన్నారు. దీంతో మొన్నటి వరకు పుకార్లుగా ఉన్న మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు నిజమేనని వార్తలు షికార్లు చేశాయి. అయితే అది ఓ రియాలిటీ షో కోసం చేసిన ఫ్రాంక్ వీడియో అని విష్ణు కవర్ చేయాలని చూశారు. కానీ అనుమానాలు అలానే ఉన్నాయి. అయితే ఇటీవల తిరుపతికి వచ్చిన మంచు మనోజ్ మీడియాపై మంచు మనోజ్ చిందులు వేశారు. కుటుంబ గొడవలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. సెగ్గడ్డ వచ్చింది గోకండంటూ సెటైర్లు వేశారు. దీంతో మీడియా ప్రతినిధులు మనోజ్ ప్రవర్తనపై ఫైర్ అయ్యారు.
Read Also: Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు