మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కనీసం టీజర్ కూడా విడుదల కాకుండానే ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, యూఎస్ (USA), యూకే (UK) వంటి దేశాల్లో బుకింగ్స్ మొదలయ్యాయి.
Also Read : Spirit Movie : బాహుబలి, కేజీఎఫ్ లైన్లో ‘స్పిరిట్’ – వంగా మాస్టర్ ప్లాన్
సాధారణంగా పెద్ద సినిమాలకు టీజర్ లేదా ట్రైలర్ వచ్చాక బుకింగ్స్ ఊపందుకుంటాయి. కానీ, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ పాటలు చార్ట్బస్టర్లుగా నిలవడంతో ఓవర్సీస్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది.. టీజర్ రాకముందే అక్కడ షోలు సాలిడ్ ఆక్యుపెన్సీతో దూసుకుపోవడం విశేషం. భీమ్స్ సంగీతం, నయనతార హీరోయిన్గా ఉండటం, పైగా అనిల్ రావిపూడి మార్కు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావడం ఈ జోష్‌కు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ వారు నిర్మిస్తున్న ఈ మెగా పండుగ వినోదం సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.