Threat Calls to Gadkari : రూ. 100కోట్లు ఇవ్వకుంటే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి హాని తలపెడతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ చేసిన వ్యక్తిని కర్ణాటక పోలీసులు గుర్తించారు. బెలగావి జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి బెదిరింపు కాల్స్ చేశాడని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బెలగావి జైలు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడు తాను దావూద్ ఇబ్రహీం ముఠాలో సభ్యుడని పేర్కొన్నారు. ఈ బెదిరింపు కాల్ పై విచారించేందుకు నాగ్‌పూర్ పోలీసులు బెలగావి వచ్చారు.
Read Also: Offensive Comments : కోహ్లీ, ధోని కుమార్తెలపై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి జయేష్ పూజారిగా పోలీసులు గుర్తించారు. ఓ హత్య కేసులో కోర్టు జయేష్ కు మరణశిక్ష విధించింది. నాగ్‌పూర్ పోలీసుల బృందం సోమవారం పూజారిని ప్రశ్నించడానికి అనుమతించాలని బెలగావి జైలు అధికారులను అభ్యర్థించింది. నాగ్‌పూర్‌లోని ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం యొక్క ల్యాండ్‌లైన్ నంబర్‌కు మూడు బెదిరింపు కాల్‌లు వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్ తర్వాత బీజేపీకి చెందిన నాగ్‌పూర్ ఎంపి ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతను పటిష్ఠ చేశారు.తన డిమాండ్లను నెరవేర్చకుంటే మంత్రికి హాని చేస్తానని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించినట్లు పోలీసులు చెప్పారు. దీనిపై కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై స్పందించారు. కాల్ చేసిన వారిపై దర్యాప్తు కొనసాగుతుందని.. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామన్నారు.
Read Also: Babar Azam: మరో వివాదంలో పాకిస్థాన్ కెప్టెన్.. హనీ ట్రాప్‌లో బాబర్ ఆజమ్