Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Man Stabs Daughter 25 Times Over Domestic Dispute In Surat Attack Caught On Camera

Man Stabs Daughter: దారుణం.. కన్నకూతురినే 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

Published Date :May 31, 2023 , 3:10 pm
By Mahesh Jakki
Man Stabs Daughter: దారుణం.. కన్నకూతురినే 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Man Stabs Daughter: గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం జరిగింది. కనిపెంచిన కన్నతండ్రే కన్నకూతురి పాలిట కాలయముడయ్యాడు. కూతురిని 25 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్యచేశాడు. ఇంట్లో తగాదాల కారణంగా తన కుమార్తెను కత్తితో 25 సార్లు పొడిచి చంపి, అతని భార్యను గాయపరిచినందుకు సూరత్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మే 18వ తేదీ రాత్రి సూరత్‌లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రామానుజ అనే దుండగుడు తన కుటుంబంతో కలిసి సూరత్‌లోని సత్య నగర్ సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తమ కుమార్తె టెర్రస్‌పై పడుకున్న విషయంపై భార్యతో జరిగిన చిన్నపాటి వాదనలో నిందితుడు సహనం కోల్పోయాడు. పరిస్థితి తీవ్రమై హింసకు దారితీసింది. సుమారు రాత్రి 11.20 గంటలకు, రామానుజు మొదట తన పిల్లల ముందే తన భార్యపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న పిల్లలు అడ్డుకోబోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన రామానుజ.. కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కూతురిని 25 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Read Also: BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..

తన కుమార్తెపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత కూడా, రామానుజు తన భార్యకు హాని చేయాలని నిశ్చయించుకుని డాబాపైకి ఎక్కాడు. తమ తల్లిని రక్షించడానికి సాహసోపేతమైన ప్రయత్నంలో, పిల్లలు జోక్యం చేసుకోగా.. రామానుజ దాడికి కూతురు బలి అయింది. దీంతో సూరత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికారులు వేగంగా రామానుజను పట్టుకున్నారు. హత్యాయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై హత్య, హత్యాయత్నం సహా ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆర్‌కే పటేల్ తెలిపారు.విచారణ కొనసాగుతుండగా, అధికారులు బాధితురాలు, ఫిర్యాదుదారు రేఖ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. గాయపడిన వారు మరోవైపు చికిత్స పొందుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • domestic dispute
  • Gujarat
  • Man Stabs Daughter
  • stabs 25 times

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh Pre Release Event LIVE : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ జాతర.. నేడే ప్రీ-రిలీజ్ ఈవెంట్..

  • IPL 2026: కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!

  • Half Day Schools : చిన్నారుల రక్షణే ముఖ్యం.. పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీలకు హాఫ్ డే స్కూల్స్

  • Indiramma Canteen: రూ.5కే భోజనం.. గ్యాస్ ఇబ్బంది అస్సలే లేదు..

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
advertisement will close in 5 seconds ×
ads