Bihar : ప్రేమ ఎంత మధురం అన్న నానుడి నేటి యువత బాగా వంట పట్టించుకున్నారు. నెక్కరు నుంచి ప్యాంట్ కు వచ్చి ప్రతి వాడికి ఓ గర్ల్ ఫ్రెండ్ కామన్ అయిపోయింది. చాలా తక్కువ మందికే గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రేమను నిలబెట్టుకోవడానికి, ప్రియురాలిని దక్కించుకోవడానికి ఎంతకైనా పోరాడుతున్నారు. కొన్ని సార్లు అందుకు ఎవరినైనా ఎదిరిస్తున్నారు. ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా జైలు కెల్లాడు. ఆ ప్రేమను గెలిపించుకోవడం కోసం కోర్టు ఆవరణలోనే పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం సీతామఢి జిల్లా బర్గానియాలో చోటుచేసుకుంది.
Read Also:Puvvada Ajay Kumar: ఆ పార్టీలోకే పొంగులేటి అడుగులు.. పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు..
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బర్గానియాకి చెందిన రాజా(28), అదే ప్రాంతానికి చెందిన అర్చన(23) ఇద్దరి మనసులు కలిశాయి. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. గత నవంబర్ లో వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో నుంచి పారిపోయారు. యువతి తండ్రి రాజా పై పోలీసులను ఆశ్రయించి అతడిపై కిడ్నాప్ కేసు పెట్టాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ కేసుపై ఇటీవల ఓ స్థానిక కోర్టులో విచారణ జరిగింది. అర్చన, రాజాకి పెళ్లి జరిపిస్తామని ఇరు కుటుంబ సభ్యులు కోర్టుకు తెలియజేశారు. దీంతో దీనికి న్యాయస్థానం కూడా అంగీకరించింది. ఇంకేముంది పోలీసులు సమక్షంలో, కోర్టు ఆవరణలోనే వీరి పెళ్లి జరిపించారు. పెళ్లి అనంతరం రాజాని మళ్లీ పోలీసులు జైలుకు తీసుకువెళ్లారు. ఈ కేసు విచారణ త్వరలోనే మళ్లీ కోర్టు ముందుకు రానుంది. ఆ రోజు అతనిపై ఉన్న కేసును న్యాయస్థానం కొట్టి వేసే అవకాశం ఉంది.
Read Also:Big Breaking: శరత్ బాబు కన్నుమూత!