Black Magic: సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. ముఖ్యంగా క్షుద్రశక్తుల కోసం చంపడమో.. చావడమో.. లాంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడే దారుణంగా చంపేశాడు. అనంతరం ఆ మంత్రగాడి రక్తం తాగాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బసంత్ సాహు అనే వ్యక్తి దగ్గర రౌనక్ సింగ్ ఛబ్రా అలియాస్ మన్య అనే వ్యక్తి తంత్ర విద్య నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో గురుశిష్యులు ఇద్దరూ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. కాగా శిష్యుడు తంత్ర-మంత్ర విద్యలో గురువును మించిన శక్తులు పొందాలనుకున్నాడు. అంతే.. అర్ధరాత్రి గురువుతో కలిసి స్మశానంలో క్షుద్రపూజలు చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గురువు బసంత్‌ను చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్రపూజలు చేసే శక్తులు తనకూ వస్తాయని భావించాడు. బసంత్ క్షుద్రపూజలు చేస్తుండగా అతనిపై దాడి చేశాడు. ఓ పెద్ద కర్రతో గురువు తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత గురువు రక్తం బయటకు రాగానే.. రక్తం తాగడం ప్రారంభించాడు.
Cruel Father: మా నాన్న మంచోడు కాదు.. జైల్లో పెట్టండి
ఆ తర్వాత గురువు గారి ప్రైవేట్ భాగంలో కర్ర పెట్టి కాల్చాడు. అనంతరం గురువు మృతదేహాన్ని దహనం చేశాడు. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుణ్ని అరెస్టు చేసినట్లు ధామ్‌తరీ పోలీసులు తెలిపారు. బాధితుడి బంధువు దేవేంద్ర సాహు నయాపారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. తంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చంపి, అతని రక్తాన్ని తాగితే, తంత్ర సాధక్‌కు ఆ శక్తులన్నీ లభిస్తాయని ఒక సాధువు చెప్పాడని అందుకే అలా చేశానని రౌనక్ సింగ్ ఛబ్రా వెల్లడించాడు.