NTV Telugu Site icon

Alluri Sitharamaraju District: అరకులోయలో మరో చేతబడి హత్య కలకలం..!

Black Magic

Black Magic

అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో గడబంటు భీమన్న(46) హత్యకు గురయ్యాడు. హత్య చేసిన చిట్టపురి పొల్లు అనే వ్యక్తి హత్యకు వాడిన కత్తితో సహా అరకులోయ పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు. హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని డిఎస్పీ షేక్ సహాబాజ్ అహమద్ తెలిపారు. ఓ వైపు హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని చెబుతుండగా.. గ్రామస్థులు, బంధువులు మాత్రం హత్యకు చేతబడే కారణమని చెపుతున్నారు.

READ MORE: Jangaon: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని డీకొన్న కారు.. ముగ్గురు మృతి

మృతుడు నిందితుని కుటుంబంపై చిల్లంగి చేశాడని అనుమానంతోనే హత్య చేశాడని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అల్లూరి ఏజెన్సీలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చెడుపు, చిల్లంగి వంటివి విడనాడాలని పిలుపునిచ్చిన వారంలోపే ఈ ఘటన చోటుచేసుకుంది. మూఢనమ్మకాలతో అరుకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాలలో తరచు చేతబడి సంఘటనలో పలువురు మృత్యువాతకు గురవుతున్నారు.

READ MORE: Rahul Gandhi: రాజస్థాన్‌ పర్యటనలో రాహుల్‌గాంధీకి వింత అనుభవం.. కార్యకర్త ఏం అడిగాంటే..!