అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో గడబంటు భీమన్న(46) హత్యకు గురయ్యాడు. హత్య చేసిన చిట్టపురి పొల్లు అనే వ్యక్తి హత్యకు వాడిన కత్తితో సహా అరకులోయ పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు. హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని డిఎస్పీ షేక్ సహాబాజ్ అహమద్ తెలిపారు. ఓ వైపు హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని చెబుతుండగా.. గ్రామస్థులు, బంధువులు మాత్రం హత్యకు చేతబడే కారణమని చెపుతున్నారు.