Kashmir : జమ్మూకశ్మీర్‌లోని ఓ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ఓ వృద్ధ పేద వ్యక్తి విరాళంగా ఇచ్చిన గుడ్డు రెండు లక్షలకు పైగా ధర పలికింది. గ్రామంలో మసీదు నిర్మించేందుకు చాలా మంది ముందుకు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. వీటిలో ఓ పేద వ్యక్తి దానం చేసిన గుడ్డు కూడా ఉంది. ఈ ఘటన ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. సోపోర్‌లోని సెబ్ పట్టణంలోని గ్రామస్తులు మసీదు కోసం విరాళాలు సేకరించడం ప్రారంభించిన తర్వాత ఒక పేద వృద్ధుడు మల్పోరా గ్రామంలోని మసీదు కోసం గుడ్డును విరాళంగా ఇచ్చాడు. మసీదు కమిటీ గుడ్డును అంగీకరించింది. ఇతర విరాళాల మాదిరిగానే దానిని వేలానికి ఉంచింది. ఆ వ్యక్తి మసీదుకు విరాళంగా ఇచ్చిన గుడ్డు ఆకర్షణీయంగా మారింది.
Read Also:Viral Video: నీ రీల్స్ పిచ్చి తగలెయ్య.. రీల్స్ కోసం ఏకంగా చెట్టు పై..?!
కోడిగుడ్లు పలుమార్లు వేలంపాటలు జరిగినట్లు మసీదు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి వేలం తర్వాత, కొనుగోలుదారులు నిధులను సేకరించడానికి మరొక వేలం కోసం గుడ్డును మసీదు కమిటీకి తిరిగి పంపుతారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గుడ్డును చివరిగా కొనుగోలు చేసిన వ్యక్తి రూ.70,000కు కొనుగోలు చేశాడు. ఈ విధంగా పదేపదే గుడ్డు వేలం ద్వారా సేకరించిన మొత్తం సుమారు రూ. 2.2 లక్షలకు చేరుకుంది. “మేము ఈ గుడ్డు వేలం పూర్తి చేసాము. దాని నుండి రూ. 2.26 లక్షలు వసూలు చేసాము” అని మసీదు కమిటీ సభ్యుడు తెలిపారు.
Read Also:RCB vs SRH: నేనూ బ్యాటర్ అయితే బాగుండు.. ప్యాట్ కమిన్స్ సరదా వ్యాఖ్యలు!