Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. లక్ష్మిరెడ్డి శ్రీను అనే వ్యక్తి తన తమ్ముడు రాజుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. ఉన్నట్టుండి నొప్పితో విలవిల్లాడటంతో.. వెంటనే రాజు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఫలితం లేకపోయింది. శ్రీను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ఇలాగే అవతార్-1కు కూడా జరిగింది. తైవాన్‌లో 42 ఏళ్ళున్న ఒక వ్యక్తి ‘అవతార్’ సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. డాక్టర్‌లు ఆ వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ఓవర్ ఎగ్జైట్ అయ్యాడని, దానీ వల్ల ఆ వ్యక్తికి అధిక రక్తపోటు వచ్చిందని తెలిపాడు. శ్రీనుకి భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. సినిమాకి వెళ్లిన అతను.. విగతజీవుడై ఇంటికి రావడంతో.. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లల రోదనలు మిన్నంటాయి.
![]()
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Read Also: Anushka Shetty: యంగ్ కుర్రాడితో ప్రేమలో పడిన అనుష్క.. వివరాలివే
ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అవతార్-2 శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్‌లకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక భారీ అంచనాల నడుమ రిలీజైన అవతార్-2 అంతే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన హాలీవుడ్ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగులో ఈ చిత్రం రూ.13 కోట్లకు పైగా షేర్ కలెక్షన్‌లను సాధించింది.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!