Site icon NTV Telugu

Suicide : ప్రియురాలి బ్లాక్‌మెయిలింగ్‌తో ప్రియుడి ఆత్మహత్య.. నాలుగు పేజీల సూసైడ్ నోట్..

Suicide

Suicide

పంజాబ్‌లోని బటిండా జిల్లా నుంచి ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలి బ్లాక్‌మెయిలింగ్‌తో బాధపడిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 32 ఏళ్ల రాహుల్ కుమార్ సంగువానా బస్తీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు వదిలాడు. అందులో తన ప్రేయసిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ‘ఆమె నన్ను చంపుతుంది!’ అని రాసుకొచ్చినట్లు సమాచారం.

READ MORE: BRS Party: మెట్రో టికెట్ రేట్స్ పెంపు.. ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ డిమాండ్

కెనాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హర్జీవన్ సింగ్ ప్రకారం.. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రింకు బాలా గతంలో రాహుల్‌పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారని, అందులో రాహుల్ బెయిల్‌పై విడుదలయ్యారని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. పోలీసులు ఇప్పుడు ఆ కేసు ఫైల్‌ను కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి డబ్బులు లాగేందుకు యత్నించిందని, ఆ అమ్మాయి గురించి కీలక విషయాలు సూసైడ్ నోట్‌లో రాశాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక రాహుల్ బలవన్మరణానికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. కానీ పోలీసులు ఆ నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో ఏముంది? అనే అంశాన్ని బయట పెట్టలేదు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని చెబుతున్నారు.

READ MORE: Anirudh: అనిరుథ్‌కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ?

ఈ అంశంపై రాహుల్ తండ్రి సీతా రామ్ మాట్లాడుతూ.. “నా కొడుకు చాలా కాలంగా రింకు బాలా అనే మహిళతో ప్రేమలో ఉన్నాడు. కానీ క్రమంగా వారి సంబంధం చెడిపోయింది. రింకు నా కొడుకును వేధింపులకు గురి చేసింది. బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో.. మానసికంగా హింసకు గైరైన నా కొడుకు గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.” అని చెప్పారు.

Exit mobile version