పంజాబ్‌లోని బటిండా జిల్లా నుంచి ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలి బ్లాక్‌మెయిలింగ్‌తో బాధపడిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 32 ఏళ్ల రాహుల్ కుమార్ సంగువానా బస్తీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు వదిలాడు. అందులో తన ప్రేయసిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. 'ఆమె నన్ను చంపుతుంది!' అని రాసుకొచ్చినట్లు సమాచారం.
ఒకప్పుడు అతను కబడ్డీలో ఛాంపియన్. రాష్ట్రం తరపున కబడ్డీ పోటీల్లో అనేక పతకాలు సాధించాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. కొడుకు కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన చేయాతను అందించారు. వారి కష్టం ఊరికే పోలేదు. కొడుకు రాష్ట్రస్థాయిలో రాణించాడు. మంచి ప్రతిభను చాటుకున్నాడు. ఇదంతా గతం. ప్రస్తుతం తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉండటం వలన వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు బడ్డీకొట్టు నడుపుతున్నాడు. వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. Read: “ఛత్రపతి”…