Lovers Suicide: ఇద్దరూ ప్రేమించుకున్నారు...!! చదువు పూర్తయ్యాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు !! ఇంతలోనే ప్రియురాలు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా మంచిర్యాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను బంగారం అంటూ... సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పుట్టిన ప్రేమ... ఇద్దరినీ బలికోరింది. ఇంతకు ఆ యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు !! ఇద్దరి ఆత్మహత్య వెనకా దాగున్న మిస్టరీ ఏంటి..?
పంజాబ్‌లోని బటిండా జిల్లా నుంచి ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలి బ్లాక్‌మెయిలింగ్‌తో బాధపడిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 32 ఏళ్ల రాహుల్ కుమార్ సంగువానా బస్తీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు వదిలాడు. అందులో తన ప్రేయసిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. 'ఆమె నన్ను చంపుతుంది!' అని రాసుకొచ్చినట్లు సమాచారం.