Suicide : ప్రియురాలి బ్లాక్‌మెయిలింగ్‌తో ప్రియుడి ఆత్మహత్య.. నాలుగు పేజీల సూసైడ్ నోట్..
- పంజాబ్‌లోని బటిండా జిల్లాలో ఘటన
- ఆత్మహత్య చేసుకున్న 32 ఏళ్ల రాహుల్
- ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య
- నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లోని బటిండా జిల్లా నుంచి ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలి బ్లాక్‌మెయిలింగ్‌తో బాధపడిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 32 ఏళ్ల రాహుల్ కుమార్ సంగువానా బస్తీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు వదిలాడు. అందులో తన ప్రేయసిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ‘ఆమె నన్ను చంపుతుంది!’ అని రాసుకొచ్చినట్లు సమాచారం.
READ MORE: BRS Party: మెట్రో టికెట్ రేట్స్ పెంపు.. ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ డిమాండ్
Also Read
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
- Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
కెనాల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ హర్జీవన్ సింగ్ ప్రకారం.. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రింకు బాలా గతంలో రాహుల్‌పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారని, అందులో రాహుల్ బెయిల్‌పై విడుదలయ్యారని ఎస్హెచ్ఓ తెలిపారు. పోలీసులు ఇప్పుడు ఆ కేసు ఫైల్‌ను కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి డబ్బులు లాగేందుకు యత్నించిందని, ఆ అమ్మాయి గురించి కీలక విషయాలు సూసైడ్ నోట్లో రాశాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక రాహుల్ బలవన్మరణానికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. కానీ పోలీసులు ఆ నాలుగు పేజీల సూసైడ్ నోట్లో ఏముంది? అనే అంశాన్ని బయట పెట్టలేదు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని చెబుతున్నారు.
READ MORE: Anirudh: అనిరుథ్కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ?
ఈ అంశంపై రాహుల్ తండ్రి సీతా రామ్ మాట్లాడుతూ.. “నా కొడుకు చాలా కాలంగా రింకు బాలా అనే మహిళతో ప్రేమలో ఉన్నాడు. కానీ క్రమంగా వారి సంబంధం చెడిపోయింది. రింకు నా కొడుకును వేధింపులకు గురి చేసింది. బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో.. మానసికంగా హింసకు గైరైన నా కొడుకు గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.” అని చెప్పారు.
తాజావార్తలు
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!