Attack On Woman: ఎవరైనా మన ఇంటి వైపు నుంచి వెళుతూ డోర్ కొట్టి దాహం అవుతుంది మంచి నీరు కావాలని అడిగితే ఇవ్వడం సహజం. అయితే ప్రస్తుతం మనం ఎలాంటి సమాజంలో ఉన్నమంటే పక్కవాడికి సాయం చేస్తే కూడా వారే చివరికి మన చెడు కోరుకుంటున్నారు. మంచి నీరు కావాలని వచ్చి మహిళలపై దాడి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న వాటిని దోచుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూస్తేనే భయం వేసేలా ఉంది. ఈ సంఘటన జైపూర్‌లోని కర్ధానిలో ఉన్న మంగళం సిటీ సొసైటీలో జరిగింది.ఈ ఘటన ఎప్పుడో జరిగినా ప్రస్తుతం ఎక్స్( ట్విటర్) లో వైరల్ అవుతుంది.
జాగ్రత్తగా ఉండండి. దాహం వేస్తుందన్న వ్యక్తికి నీరందించిన మహిళకు ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి అంటూ దానిని ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పోలీసు డ్రస్ లో వచ్చి మంచి నీరు కావాలని ఓ మహిళను అడుగుతాడు. ఆ మహిళ లోపలి వెళ్లి గ్లాసుతో మంచి నీరు తీసుకొని వస్తుంది. అతడు అవి తాగేసి ఇంకొంచెం కావాలని అడుగుతాడు. ఆ మహిళ మళ్లీ లోపలికి వెళ్లి నీరు తీసుకొని వస్తుంది. ఈ లోపు అతడు చుట్టుపక్కల అంతా గమనిస్తూ ఉంటాడు. మహిళ మళ్లీ నీరు తీసుకొని రాగానే ఒక్కసారిగా అతడు ఆ మహిళపై దాడి చేస్తాడు. ఆ మహిళ అతడిని ప్రతిఘటించడానికి ప్రయత్నించిన ఆమె వల్ల కాదు. అతడు ఆమెను వారి ఇంటి లోపలికే తీసుకువెళతాడు. వెంటనే కింద నుంచి కూడా మరో ఇద్దరు యువకులు ఆ ఇంటిలోకి పరిగెత్తుకొచ్చి డోర్ వేస్తారు. తరువాత కొద్ది సేపటికి ఆ ముగ్గురు ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోతారు. ఆ మహిళ వారి వెనుక పరిగెత్తడం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ వీడియోను సరిగ్గా పరిశీలిస్తే వారు ఇంటి నుంచి పారిపోయేటప్పుడు ఎదురింటి వారు డోర్ తీసి చూసి కూడా సాయం చేయకుండా భయంతో డోర్ వేసేసుకుంటారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ తతంగం మొత్తం రికార్డ్ అయ్యింది.
Also Read: Sex Racket: హానీ ట్రాప్.. వీడియోలు చూపుతూ 50 మంది పురుషులకు బెదిరింపులు
ఈ వీడియో చూసిన వారు మొదట భయపడుతున్నారు. “పానీ పిలానా భీ సేఫ్ నహీ హై ఆజ్కల్ (ఈ రోజుల్లో మంచి నీరు ఇవ్వడం కూడా మంచిది కాదు) . ఇది చాలా ప్రమాదకరం అంటూ పోస్ట్ చేశారు. మరొకరు ఇలాంటివి చూస్తుంటే చాలా భయమేస్తోంది. సాయం చేయడం కూడా తప్పేనా అని వాపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల్లో వీక్షించారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో చూసిన వారు సూచిస్తున్నారు.