NTV Telugu Site icon

Mamata Banerjee: ప్రియాంక గాంధీకి మద్దతుగా వయనాడ్‌లో బెంగాల్ సీఎం ప్రచారం..!

Mamatha

Mamatha

Mamata Banerjee: కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సయోధ్య కుదిరినట్లుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేసేందుకు స్వయంగా రంగంలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగాల్ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రితో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం భేటీ అయిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Read Also: Mancherial: మంచిర్యాలలో విచిత్ర ఘటన.. చనిపోయిన నాలుగేళ్ల తర్వాత కాల్ లెటర్..

కాగా, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతుంది. రాష్ట్రంలో టీఎంసీ- కాంగ్రెస్‌ పోత్తు చర్చలు విఫలం కావడానికి అధీర్ రంజన్ చౌదరి కారణమని టీఎంసీ అధినేత్రి పేర్కొన్నారు. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ భారతీయ జనతా పార్టీపై పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలకు ఏకంగా 29 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీ.. కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు కొనసాగించారు.

Read Also: Train Stuck On Bridge: బ్రిడ్జి మీద ఆగిన రైలు.. గాల్లో వేలాడుతూ రిపేర్ చేసిన లోకోపైలట్లు..

ఇందులో భాగంగానే.. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తొలుత సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ ఛద్దా, అనంతరం ముంబైలో ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఇక టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, సాగరికా ఘోసే, సాకేత్ గోఖలేలు ఎగ్జిట్ పోల్స్ అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ ఎన్సీపీ నేతలతో కలిసి ధర్నా కూడా చేశారు. అయితే, ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రిని ప్రసన్నం చేసుకునేందుకు పీ చిదంబరం నేరుగా చర్చలకు వెళ్లారు. మరోవైపు, అధీర్ రంజన్ చౌదరి కూడా మమతా బెనర్జీపై విమర్శలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తనకు మమతతో రాజకీయంగా తప్ప వ్యక్తిగత అభిప్రాబేధాలు ఏమీ లేవంటూ అధీర్ రంజన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం మమత కూడా ప్రియాంక గాంధీ తరపున వయనాడ్‌లో ప్రచారం చేయబోతున్నట్లు జాతీయ మీడియాలో న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు.