West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: బెంగాల్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీకి వరసగా ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో పరాజయం పాలైన దీదీని ఉద్దేశిస్తూ ‘‘దొంగ, దొంగ’’ అంటూ పలువురు నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల అనంతరం హింస, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి కేసు వాదించడానిక గురువారం ఆమె కలకత్తా హైకోర్టు ముందు హాజరయ్యారు. ఆమె కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా, ఆమెను ఉద్దేశిస్తూ కొందరు ‘‘దొంగ..దొంగ’’ అంటూ నినాదాలు చేశారు.
Read Also: Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
Also Read
ఈ షాకింగ్ పరిణామంతో మమతా బెనర్జీ .. ‘‘వారు నాపై దాడి చేశారు’’ అంటూ విలేకరులతో అన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత మమతా కోర్టు విడిచి వెళ్లిపోయారు. ఈ పరిణామంపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. మమతా బెనర్జీతో పాటు, న్యాయవాది కళ్యాణ్ బెనర్జీని బీజేపీ ప్రభావం ఉన్న నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారని, ఆమెను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి టీఎంసీ న్యాయ బృందం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెప్పింది. ఒకరిని దొంగగా, బందిపోటుగా ముద్ర వేయడానికి కోర్టు సరైన ప్రదేశం కాదని హితవు పలికింది. మమతా బెనర్జీకే ఇలాంటి పరిస్థితి ఉంటే, బెంగాల్లో టీఎంసీ కార్యకర్తల పరిస్థితిని ఊహించుకోండి అని కళ్యాన్ బెనర్జీ అన్నారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం చవిచూసింది. మే 4న విడుదలై ఫలితాల్లో 294 సీట్లకు గానూ బీజేపీ 207 గెలిస్తే, టీఎంసీ 80 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగినట్లు టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కలుగజేసుకోవాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, జస్టిస్ పార్థ సారథి సేన్లతో కూడిన ధర్మాసనం ముందు మమతా వాదించారు.
Chor Chor slogans raised at Mamata Banerjee at Calcutta High Court. pic.twitter.com/p1oNqaR05Q
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) May 14, 2026
తాజావార్తలు
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్‌హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?