Storm Hit UP: ఒక్క రోజే 100 మంది మృతి.. యూపీలో తుఫాను బీభత్సం..
- ఉత్తర్ ప్రదేశ్‌లో తుఫాను బీభత్సం..
- ఒక్క రోజే 100 మంది మృతి..
- హోరు గాలులు, వర్షంతో అల్లాడిన యూపీ..
- థండర్స్క్వాల్ ఎఫెక్ట్ కారణమని చెబుతున్న నిపుణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Storm Hit UP: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, తుఫాన్ అతలాకుతలం చేసింది. బుధవారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ వర్ష బీభత్సానికి రాష్ట్రంలో 100 మంది మరణించారు. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 21 మంది మృతి చెందారు.
భదోహిలో 18 మంది, మీర్జాపూర్లో 15 మంది, ఫతేపూర్‌లో 10 మంది, ఉన్నావ్, బదాయూన్‌లలో చెరో ఆరుగురు, ప్రతాప్‌గఢ్, బరేలీలలో చెరో నలుగురు, అలాగే సీతాపూర్, రాయ్‌బరేలి, చందౌలీలలో ఇద్దరు చొప్పున మరణించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆర్థిక సాయాన్ని పంపణీ చేయాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఐదారు జిల్లాల్లో హోరుగాలి, వర్షం బీభత్సం సృష్టించింది. హోర్డింగులు, రేకుల షెడ్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరియాయి.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
థండర్ స్క్వాల్ ఎఫెక్ట్:
థండర్ స్క్వాల్ అనేది సాధారణ వర్షం కాదు. ఇది చాలా వేగంతో కదిలే తుఫాను. భూమిపై ఉన్న వేడి గాలి, దానిపై ఉన్న చల్లగాలుల మధ్య ఏర్పడే ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఇది ఏర్పడుతుంది. ఈ రెండు గాలులు ఢీకొట్టడం వల్ల భారీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయి. ఉరుములు, మెరుపులతో భారీ గాలుల వర్షం ఏర్పడుతుంది. గాలి వేగం గంటలకు 50-100 కి.మీ ఉంటుంది. మే నెలలో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ఇలాంటి తుఫానులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!