Site icon NTV Telugu

Mallu Ravi : గిరిజనుల కోసం పదేళ్ల పాలనలో ఏమి చేశారు

Mallu Ravi

Mallu Ravi

Mallu Ravi : కాంగ్రెస్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజనుల కోసం పదేళ్ల పాలనలో ఏమి చేశారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు, రైతులను రెచ్చగొట్టింది కేటీఆర్ కాదా? అని ఆరోపించారు. గొడవలకు కారణం కేటీఆర్ అని తేలడంతో, నూతన డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ నేతలు కలెక్టర్‌పై దాడి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో, ప్రజలను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Strong Bones Calcium: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. క్యాల్షియం కొరత ఉండదు

Exit mobile version