TPCC Mahesh Goud : మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తాం

  • మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తాం
  • పార్టీ బలోపేతంపై సమీక్ష సమావేశాలు
  • తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎక్కడా ఇవ్వడం లేదు
  • కులగణన దేశానికే ఆదర్శం తెలంగాణ. -టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌
Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్‌లో ఆంతర్య విభేదాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిపై ఆయన పార్టీ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీవ్ర ఆక్షేపాలు చేశారు. పార్టీ క్షమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న మల్లు రవి, పార్టీ లైన్‌ను దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయ్‌తో కలసి తిరుగుతున్నారని సంపత్ ఆరోపిస్తూ, ఈ విషయాన్ని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు.

Gautam Gambhir: “రోడ్‌షోలు అవసరమా..?” బెంగుళూరు ఘటనపై టీమిండియా కోచ్ రియాక్షన్ ఇదే..!

ఈ ఫిర్యాదులపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించారు. మల్లు రవిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కేడర్‌తో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేవని తెలిపారు. కులగణన విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.

Kailash Vijayvargiya: “చిన్న దుస్తులు వేసుకున్న అమ్మాయిలు నచ్చరు” మళ్లీ వివాదాల్లో బీజేపీ మంత్రి..!