మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాజ్ రాచకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చింతికింది మల్లేశం అనే చేనేత కార్మికుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని మల్లేశం అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు ఆయన. ఆ సినిమా చేసిన నాలుగేళ్లకు హిందీలో 8 ఏఎం మెట్రో అనే మరో సినిమా చేసి మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయింది కానీ ఎందుకో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అయితే ఆయన మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
GAMA Awards 2025 : త్వరలో 5వ ఎడిషన్ గామా అవార్డ్స్
మల్లేశం సినిమా డైరెక్టర్ మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతానికి సినిమాకి సంబంధించిన స్క్రిప్టింగ్ పూర్తి కావస్తున్నట్లుగా చెల్లిస్తోంది. వీలైనంత త్వరలో ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని ప్రేక్షకులు ముందుకు సినిమాని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా ఒక రూటెడ్ కథతోనే ఆయన ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సినిమాకు సంబంధించిన ఒక హింట్ ఇస్తూ పోస్టర్ వదిలారు. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? అంటూ ప్రశ్నిస్తూ ఆ పోస్టర్ ఉంది.