Maldives President: భారత్‌తో వివాదం.. పర్యాటకులను పంపాలని చైనాకు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives President: వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాల్దీవులే. సెలబ్రిటీలు కూడా తరచూ మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి బీచ్‌లు, రిసార్ట్స్‌లో సేద తీరుతుంటారు. ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్‌కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్‌కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్‌గా పెట్టుకుంటుంటారు. అయితే, తాజాగా ఈ పర్యాటక ప్రాంతంపై ఇప్పుడు వివాదం నెలకొంది. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు.. తమ లిస్టులో లక్షద్వీప్‌ను చేర్చుకోవాలని సూచిస్తూ ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్‌పై మాల్దీవుల మంత్రులు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల వ్యాఖ్యలతో ఆ దేశ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ దేశం అంతా పర్యాటక రంగంపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇక ఏటా మాల్దీవులను సందర్శించే పర్యాటకుల్లో భారతీయులే అత్యధికం.
Read Also: Maun Vrat: రామమందిరం ప్రారంభోత్సవం.. 32 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించుకోనున్న మహిళ
Also Read
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
ఈ క్రమంలోనే భారత్ నుంచి పర్యాటకులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. భారతీయుల నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఎక్కువ మంది పర్యాటకులను పంపాలని మాల్దీవుల అధ్యక్షుడు చైనాను కోరారు భారతీయుల నుంచి పర్యాటక వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మంగళవారం ద్వీప దేశానికి ఎక్కువ మంది పర్యాటకులను పంపే ప్రయత్నాలను పెంచాలని చైనాకు విజ్ఞప్తి చేశారు. చైనాలో అధికారిక పర్యటనలో ఉన్న ముయిజ్జు.. ఫుజియాన్ ప్రావిన్స్‌లో మాల్దీవుల బిజినెస్ ఫోరమ్‌లో ప్రసంగించారు. ఆయన చైనాను మాల్దీవుల సమీప మిత్రదేశంగా పేర్కొన్నారు. “చైనా మా సన్నిహిత మిత్రదేశాలలో ఒకటి, అభివృద్ధి భాగస్వాములలో ఒకటి” అని ఆయన అన్నారు.
Read Also: Uttarpradesh: జనవరి 22న యూపీలో విద్యాసంస్థలకు సెలవు.. మద్యం అమ్మకాలు బంద్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతదేశానికి వ్యతిరేకంగా కొంతమంది మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం చెలరేగిన తరువాత, భారతీయ పర్యాటకులు రిజర్వేషన్లను రద్దు చేసిన నేపథ్యంలో ముయిజ్జు చైనాను విజ్ఞప్తి చేయడం గమనార్హం. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) ప్రాజెక్ట్‌ను కూడా ముయిజ్జు ప్రశంసించారు. దానిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్ర ద్వీపంలో ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్‌ను అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు 50 మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్ట్‌పై సంతకం చేశాయి.
Read Also: First Gay Prime Minister: ఫ్రాన్స్‌కు తొలి ‘గే’ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్
లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ టూరిజం పిచ్‌పై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్‌లు చేసినందుకు మాల్దీవుల ప్రభుత్వం తన ముగ్గురు డిప్యూటీ మంత్రులను సస్పెండ్ చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలు భారతీయులకు కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు ద్వీప దేశానికి తమ ప్రణాళికాబద్ధమైన సెలవులను రద్దు చేసుకున్నారు. ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ అయిన EaseMyTrip కూడా వరుస మధ్య మాల్దీవులకు విమానాలను నిలిపివేసింది. 2023లో మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో సందర్శకులు భారతదేశం నుంచి వచ్చారు. దాదాపు 209,198 మంది ఇండియా నుంచి వచ్చారు. రష్యా 209,146 మందితో రెండవ స్థానంలో ఉంది. చైనా 187,118 మందితో మూడవ స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..