ఈ రోజు (సోమవారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాల్దీవుల అధినేత ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. వీరి చర్చల ద్వారా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశిస్తున్నారు.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు వస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఇండియాలో తొలి పర్యటన చేయబోతున్నారు. జూన్‌లో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత్‌లో పర్యటించబోతున్నారు.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత్‌పై విషం చిమ్మారు. తన 22 మంది సభ్యుల కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులను విదేశీ దేశం ఆదేశాల కారణంగా మాల్దీవుల పార్లమెంట్ తిరస్కరించిందని ఆయన ఆరోపించారు. నిజానికి మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వ కేబినెట్ ఏర్పాటైన తర్వాత అందులో చేరిన మంత్రులు పార్లమెంటు ఆమోదం పొందడం తప్పనిసరి.
ఇవాళ రాష్ట్రపతి హోదాలో మాల్దీవుల అధ్యక్షుడు ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మహ్మద్ ముయిజ్జూ మాట్లాడుతూ..తాన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని అనుమతించేది లేదని తెలిపారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెట్టనున్నారు.
భారత్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో మాల్దీవుల్లో కూడా రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. దేశంలోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు - మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, డెమొక్రాట్స్ పార్టీలు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.
వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాల్దీవులే. సెలబ్రిటీలు కూడా తరచూ మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి బీచ్‌లు, రిసార్ట్స్‌లో సేద తీరుతుంటారు. ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్‌కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్‌కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్‌గా పెట్టుకుంటుంటారు.
చైనా పర్యాటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారత పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, మాల్దీవులపై తాము రెచ్చగొట్టడం గానీ, ఒత్తిడి చేయడం గానీ చేయలేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది.
హిందూ మహాసముద్ర ద్వీపసమూహం నుంచి భారత్ తన బలగాలను ఉపసంహరించుకోకుంటే తమ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ అన్నారు.