దుల్కర్ హీరోగా కన్నా క్యామియో రోల్స్‌పై ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తున్నట్లున్నాడు. 2025లో కాంత ఒక్కటే ఆయన నుండి వచ్చిన సినిమా. ఛాంపియన్, లోకలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి.. సినిమా సక్సెస్‌కు తోడ్పడ్డాడు. లోక తన సొంత నిర్మాణ సంస్థలో మూవీ కాబట్టి వచ్చాడనుకుంటే.. ఛాంపియన్‌లోనూ మెరిశాడు. మహానటి, సీతారామంతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువ చేసినందుకు వైజయంతి మూవీస్ మేకర్స్ అడగడంతోనే కాదనలేకపోతున్నాడు. మొన్న కల్కిలో.. రీసెంట్లీ ఛాంపియన్‌లో కనిపించాడు. నెక్ట్స్ మరో మూవీలో కూడా స్పెషల్ క్యామియో చేయబోతున్నాడట.
లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించబోతున్న సూర్య 46లో దుల్కర్ నటించబోతున్నాడన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ న్యూస్ టాలీవుడ్ కన్నా.. కోలీవుడ్‌కు మంచి కిక్ ఇస్తుంది… ఎందుకంటే… గతంలోనే ఈ ఇద్దరు సుధాకొంగర దర్శకత్వంలో పూరణనూర్ అనే ఫిల్మ్ చేయాల్సి ఉంది. సూర్య ప్రాజెక్ట్ నుండి క్విట్ కావడంతో డీక్యూ, నజ్రియా , మిగిలిన స్టార్ కాస్ట్ సైడ్ అయ్యారు. ఇదే పరాశక్తిగా శివకార్తీకేయన్‌తో తెరకెక్కిస్తోంది సుధా. మళ్లీ ఈ కొలబరేషన్ జరుగుతుంటే ఉబ్బితబ్బిబ్బు అయిపోతుంది కోలీవుడ్. వెంకీ అట్లూరి అడిగినందుకే లక్కీ భాస్కర్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లక్కీ భాస్కర్‌కు సీక్వెల్ ఉంటుందని ఎనౌన్స్ చేసిన వెంకీ.. సూర్య 46 కంప్లీటైన వెంటనే ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో డీక్యూ41, ఆకాశంలో ఓ తార చేస్తున్న దుల్కర్.. మలయాళంలో ఐయామ్ గేమ్ చేస్తున్నాడు. దుల్కర్ స్పెషల్ క్యామియోగా కనిపించిన సినిమాలు హిట్స్ కొడుతున్న సెంటిమెంట్ పరిగణనలోకి తీసుకుంటే.. కంగువా, రెట్రో డిజాస్టర్స్‌తో సతమతమౌతున్న సూర్య మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే.