Mammootty : అప్పుడు మామతో.. ఇప్పుడు మాజీ అల్లుడితో మమ్ముట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిరత్నం తెరకెక్కించిన కల్ట్ మల్టీస్టారర్ ఫిల్మ్ దళపతి. 1991లో రిలీజైన ఈ సినిమా రజనీకాంత్ ది బెస్ట్ మూవీల్లో టాప్ ఫైవ్ లిస్ట్‌లో కచ్చితంగా ఉంటుంది. ఇందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కూడా వన్ ఆఫ్ ది హీరో. సూర్య, దేవాలుగా తలైవా, మమ్మూక బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చి 35 ఏళ్లు దాటిపోయింది. ఆ తర్వాత రజనీ- మమ్ముట్టి కలిసి నటించకపోయినా. ఇప్పుడు ఆయన మాజీ అల్లుడు ధనుష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఈ మాలీవుడ్ స్టార్ హీరో.
Also Read : TheParadise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్..
Also Read
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
ధనుష్ అప్ కమింగ్ ఫిల్మ్‌లో మమ్ముట్టి భాగస్వామ్యం కాబోతున్నారు. ధనుష్ 55గా తెరకెక్కుతోన్న సినిమాలో స్టార్ హీరో ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు పెరియ స్వామి. అయితే ధనుష్, మమ్ముట్టి కొలాబరేట్ కావడం ఇదే తొలిసారి కాదు.. గతంలో ఓ మూవీకి కలిసి వర్క్ చేశారు. 2013లో మమ్ముట్టి, దిలీప్ నటించిన కమ్మత్ అండ్ కమ్మత్ మలయాళ మూవీలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు ధనుష్. అందులో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి హీరోగా హాజరవుతాడు ఈ కోలీవుడ్ స్టార్. అప్పటికీ రజనీ అల్లుడిగా కొనసాగడంతో మామయ్య ఫ్రెండ్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు ధనుష్. ఈ మూవీతో ధనుష్ మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరీ దళపతి తలైవా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా మారగా.. ధనుష్ 55 కూడా అతడి కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా ఛేంజ్ అవుతుందా..? చూడాలి.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!