ప్రముఖ నటుడు మోహన్‌లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేర్పంచారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది.