Makhunik Village: ప్రపంచంలో ఒక వింత గ్రామం ఉందని మీలో ఎంత మందికి తెలుసు.. అక్కడి ప్రజలందరూ మరుగుజ్జులుగా ఉంటారు మీకు తెలుసా.. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందని అనుకుంటున్నారు .. ఇరాన్ తూర్పు అంచున ఉంది. ఈ గ్రామం పేరు మఖునిక్. ఒక శతాబ్దం క్రితం వరకు కూడా ఇక్కడ నివసించే ప్రజలందరూ నేటి ఇరానియన్ల కంటే అర మీటర్ పొట్టిగా ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
READ ALSO: ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్ పెట్టండి.!
పలు నివేదికల ప్రకారం.. ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం సుమారు 1,500 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ నివసించే చాలా మంది ప్రజలు ఒక మీటర్ ఎత్తు మాత్రమే ఉన్నారని చెబుతారు. వాస్తవానికి 2005లో ఈ గ్రామం సమీపంలో 25 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉన్న ఒక మమ్మీ శరీరం గుర్తించారు. అనంతరం జరిగిన పరిశోధనలలో ఇక్కడ దొరికిన మమ్మీ శరీరం 400 సంవత్సరాల క్రితం మరణించిన ఒకరిదని వెలుగు చూసింది. అయితే ఈ గ్రామంలో నివసించిన వారు నిజంగా చాలా పొట్టిగా ఉన్నారనే ప్రజల నమ్మకాన్ని ఇది ఏమాత్రం తగ్గించలేదు.
ఈ గ్రామంలో సుమారుగా 70 నుంచి 80 ఇళ్లు ఉన్నాయి. ఉన్న ఇళ్లు అన్నీ కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడి ఇళ్లు ఎంత చిన్నవిగా ఉన్నాయో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. నిజానికి ఇక్కడి ఇళ్లు దాదాపు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల ఎత్తు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు నిజంగా మరుగుజ్జులు అని ఈ ఇళ్ల నిర్మాణం సూచిస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఎక్కువ ఎత్తు ఉన్నవారు అలాంటి చిన్న ఇళ్లలో నివసించడం అసాధ్యం. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మఖునిక్ గ్రామం మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న అనేక ఇతర గ్రామాలు కూడా ఒకప్పుడు మరుగుజ్జులు నివసించేవని చెబుతారు. అందుకే ఈ మొత్తం ప్రాంతాన్ని “మరుగుజ్జుల నగరం” అని కూడా పిలుస్తారు.
చాలా సంవత్సరాల క్రితం టెహ్రాన్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఇరాన్‌లోని ఈ ప్రాంతం ఒకప్పుడు బంజరుగా ఉండేది. ఇక్కడ ధాన్యం, పండ్ల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేది. అయితే ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్లం, టర్నిప్‌లు, బార్లీ వంటి పండ్లపై ఆధారపడి జీవించేవారు. దీంతో వారిలో పోషకాల కొరత కారణంగా, మఖ్నిక్, దాని పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజల పెరుగుదల మందగించడం ప్రారంభమైందని, ఇదే క్రమంగా వారిని మరుగుజ్జులుగా మార్చిందని ఈ నివేదిక వెల్లడించింది. ఇది ఈ వింతైన గ్రామం కథ.
READ ALSO: Sridhar Vembu Divorce Case: చాలా ఖరీదైన విడాకుల కేసు..