Avika Gor: ‘ఉయ్యాలా జంపాలా’తో తెలుగు చలనచిత్ర రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన హీరోయిన్ అవికా గోర్. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికపై తన గురించి జరుగుతున్న ఒక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంతకీ ఆ ప్రచారం దేని గురించి జరుగుతుంది, ఆవిడ ఈ ప్రచారానికి ఏ విధంగా తెరదించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..!
నిజానికి ఇటీవల అవికా గోర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ పోస్ట్‌కు ఆమె ‘కొత్త ప్రారంభం’ అనే క్యాప్షన్ పెట్టడంతో ఈ హీరోయిన్ తల్లి కాబోతుందని.. హింట్ ఇచ్చారని నెట్టింట ప్రచారం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ ప్రచారానికి తాజాగా అవికా గోర్ తెరదించారు. ఈ ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. అవన్నీ వట్టి రూమర్స్ అని తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి తెరదించారు. ఇదే పోస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. అయితే అభిమానులకు నిజంగానే ఓ పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిపారు. అయితే అది ఏంటనే విషయాన్ని మాత్రం త్వరలోనే చెప్తానని వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ 30న తన లవర్ మిళింద్ చద్వానీని అవికా గోర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇదే టైంలో గుడ్ న్యూస్ అంటూ పోస్ట్ రావడంతో.. అభిమానులు అవికా గోర్ తల్లి కాబోతుందని అనుకున్నారు. అయితే తాజాగా ఆవిడ ఈ ప్రచారానికి తెరదించారు.
READ ALSO: Sridhar Vembu Divorce Case: చాలా ఖరీదైన విడాకుల కేసు..