Adipurush: ‘ఖురాన్‌పై సినిమా తీయండి, ఏం జరుగుతుందో చూడండి’ ‘ఆదిపురుష్’పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా మొదటి నుంచి వివాదాలతోనే నడుస్తోంది. సినిమా విడుదలై ఇన్ని రోజులు కావొస్తున్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాపై ఘాటుగా వ్యాఖ్యానించిన హైకోర్టు లక్నో బెంచ్ నిర్మాతలను మందలిస్తూ.. రామాయణంలోని పాత్రలను చాలా అవమానకరంగా చూపించారని అన్నారు. ప్రస్తుతం ఖురాన్‌పై చిన్న డాక్యుమెంటరీ తీస్తే.. ఏం జరుగుతుందో ఊహించగలమా అని హైకోర్టు పేర్కొంది. ఇది ఎలాంటి చట్టపరమైన సమస్యను సృష్టిస్తుందో మీకు ఏమైనా ఆలోచన ఉందా?
Read Also:Attack on US Consulate: యూఎస్ కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ఇద్దరు మృతి
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
రామాయణం, ఖురాన్ లేదా బైబిల్‌పై వివాదాస్పద చిత్రాలను ఎందుకు తీస్తారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ‘ఆదిపురుష’పై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు లక్నో ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీప్రకాష్ సింగ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్, ‘ఖురాన్‌పై ఒక చిన్న డాక్యుమెంటరీ తీయబడిందని అనుకుందాం. ఇది తీవ్రమైన శాంతిభద్రతల సమస్యను ఎలా సృష్టిస్తుందో మీరు ఊహించగలరా?.’
Read Also:Rajamouli : ఆ ఒక్క యాడ్ కోసం రాజమౌళి తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా…?
సీబీఎఫ్‌సీ కూడా మందలించింది
ఈ బెంచ్ మాట్లాడుతూ.. ‘ఒక సినిమాలో శంకర్ త్రిశూల్‌తో నడుస్తున్నట్లు చూపించారు. ఇప్పుడు రామాయణంలోని రాముడు, ఇతర పాత్రలు చాలా అవమానకరమైన రీతిలో చూపించబడ్డాయి.’ నిషేధం పిటిషన్లపై స్పందించి వేర్వేరుగా అఫిడవిట్లు జారీ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని హైకోర్టు ఆదేశించింది. సీబీఎఫ్‌సీని మందలించిన కోర్టు.. కొందరు ‘గొప్ప వ్యక్తులు’ సర్టిఫికెట్ కూడా ఇచ్చారని పేర్కొంది. ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, ఈరోజు మౌనంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!