దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా వున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారాడు. తెలుగు ఇండస్ట్రీ నీ పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్ళాడు.ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ తో ఏకంగాతెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగి పోయింది.. ఇక రాజమౌళి మొదటి సారి ఒక యాడ్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. కెరీర్ లో అన్నీ సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి ఇంతవరకు ఎలాంటి యాడ్స్ లో కనిపించలేదు.మొదటిసారి ఆయన ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం ఒక యాడ్ లో నటించారు. ఈ యాడ్ షూటింగ్ అంతా రాజస్థాన్ లో జరిగింది.
రాజస్థాన్ లో కుటుంబంతో కలిసి వెళ్లిన రాజమౌళి ఆక్కడ యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ను కూడా ఎంజాయ్ చేశారనీ సమాచారం.. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే రాజమౌళి ఈ యాడ్ షూటింగ్ కోసం రాజమౌళి భారీగా పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.రాజమౌళి ఒకొక్క సినిమా సుమారు 150 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందింది.. ఆయన నటించిన ఈ యాడ్ కోసం అదే స్థాయిలో భారీ పారితోషకం తీసుకున్నారు అని సమాచారం.. ఈ యాడ్ కోసం రాజమౌళి ఏకంగా 3 కోట్ల రూపాయల భారీ పారితోషకం తీసుకున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.. ఈ యాడ్ రీసెంట్ గా ప్రసారం అయింది. ఈ యాడ్ లో అదిరిపోయే లుక్ లో కనిపించాడు రాజమౌళి..ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తరువాత మహేష్ సినిమాతో బిజీ కానున్నాడు. రాజమౌళి మహేష్ తో చేసే సినిమా ను మహేష్ బర్త్డే సందర్బంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.