చిత్తూరు జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఉన్న ఫాక్స్ లీక్ కంపెనీలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగసి పడుతున్న పొగలతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అంచనా వేస్తుంది యాజమాన్యం. మూడు అగ్నిమాపక వాహనాలు మంటలు ఆర్పేపనిలో నిమగ్నం అయి వున్నాయి.
Read Also: Top Headlines @ 5PM: టాప్ న్యూస్
సింగరాయకొండలో ఆన్ లైన్ మోసం
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కేటుగాళ్ళు రెచ్చిపోయారు. ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఖాతా నుండి 1.60 లక్షల నగదు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సింగరాయకొండకు చెందిన వి.గోపాలకృష్ణంరాజు అనే ఉపాధ్యాయుడి కరెంట్ బిల్ పెండింగ్ ఉందంటూ ఫేక్ మెసేజ్ పంపారు సైబర్ నేరగాళ్లు. అకౌంట్ అప్ డేట్ చేసుకోవాలంటే లింక్ క్లిక్ చేయాలని చెప్పటంతో ఫేక్ మెసేజ్ ఓపెన్ చేసి బుక్కయ్యాడు ఉపాధ్యాయుడు..ఫోన్ హ్యక్ చేసి బాదితుడి రెండు బ్యాంక్ ఖాతాల నుండి 1.60 లక్షల నగదు కాజేశారు సైబర్ నేరగాళ్లు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. SMS లు లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also:Rashmika Mandanna: నీ కాళ్లను పట్టుకొని వదలంటున్నవి చూడే కుర్రాళ్ల కళ్లు..