ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు.. ఈనెల 5వ తేదీలోగా హైదరాబాద్‌కు వస్తున్నట్లు పేర్కొన్నాడు..హైదరాబాద్‌కు చేరుకున్న మూడు రోజులు తర్వాత విచారణ అధికారుల ఎదుట హాజర అవుతారని చెప్పారు.. సంబంధించి ప్రాసెస్ ప్రారంభమైనట్లు అనుచర వర్గాలు చెప్తున్నాయి.. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాస్పోర్టు తిరిగి పునరుద్ధరించి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. ఎమర్జెన్సీ ట్రాన్సిట్ పర్మిట్ కోసం అమెరికాలోని ఇండియన్ ఎంబీసీని ప్రభాకర్ రావు కాంటాక్ట్ చేశాడు. సింగిల్ ఎంట్రీ పర్మిట్ తో ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి..
READ MORE: Sheikh Hasina: షేక్ హసీనాకు షాక్.. హత్యా నేరాల విచారణ ప్రారంభించిన బంగ్లాదేశ్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన స్వదేశానికి తిరిగి రాబోతున్నారని సమాచారం… జూన్ 5న జరిగే విచారణకు హాజరవుతానని ఆయన ఇప్పటికే దర్యాప్తు బృందానికి తెలిపినట్లు తెలిసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ, ప్రభాకర్ రావు ఓ అండర్‌టేకింగ్ లెటర్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవ్వడం ద్వారా కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు బృందం కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. ప్రభాకర్ రావు నుంచి సమగ్ర సమాచారం లభిస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత క్లారిటీకి రావచ్చని భావిస్తున్నారు.
READ MORE: Botsa Satyanarayana: చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.. కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడింది..!
ఈ కేసు తాజాగా మళ్లీ వేగం పుంజుకుంటుండటం, ప్రభాకర్ రావు విచారణకు హాజరుకావడం వల్ల, రాజకీయంగా కూడా పరిణామాలు ఉండే అవకాశముంది.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానంటూ మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసులో సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ మే2న తీర్పును ఇచ్చింది… దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభాకర్ రావు సవాలు చేస్తూ మే 9న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలేనని, చికిత్స నిమిత్తమే తాను అమెరికా వెళ్లినట్లుగా ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దేశానికి తిరిగి వస్తానని ఆయన ప్రభాకర్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు.
READ MORE: Bonalu Festival: దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజ బోనాలు.. హైదరాబాద్‌లో ఎప్పుడంటే?
ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకూడదంటూ దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఆయనకు వీలైనంత త్వరగా పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఆ పాస్‌పోర్టు అందిన 3 రోజుల్లోగా భారత్‌కు వచ్చి విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 5కు వాయిదా వేసింది.. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. గత 14 నెలలుగా ఆయన అమెరికాలో ఉన్నారు. . నేపథ్యంలో ప్రభాకర్ రావు కు పాస్‌పోర్టు అందిన వెంటనే మూడు రోజుల్లో భారత్‌కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ దశలో ప్రభాకర్ రావు పై ప్రభుత్వం గట్టిగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కూడా సూచించింది. భాకర్ రావు భారత్‌కు వస్తున్న నేపథ్యంలో, సిట్ బృందం విచారించేందుకు సిద్ధమవుతోంది. ప్రభాకర్ రావు నుంచి లభించే సమాచారం ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక కదలికతో ఏం జరగనుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది…