Mahindra-Tata- M Evs: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్–డీజిల్ వెర్షన్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న XUV 3XO, 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 1.8 లక్షల అమ్మకాలు నమోదు చేసింది. తాజాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోనూ ఇదే తరహాలో అమ్మకాలు సాగించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ టాటా నెక్సాన్ ఈవీకి నేరుగా పోటీగా నిలుస్తోంది. అలాగే ఎంజీ విండ్సర్ ఈవీకి కూడా ఇది గట్టి ప్రత్యర్థిగా మారనుంది. ఈ మోడల్‌తో మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత బలోపేతం చేస్తోంది.
READ MORE: Wife Killed Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు
XUV 3XO EVలో 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది సుమారు 310 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే సుమారు 285 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. టాటా నెక్సాన్ ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. ఒకటి 30 కిలోవాట్ అవర్, మరొకటి 45 కిలోవాట్ అవర్. ఈ కారు గరిష్టంగా 489 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని టాటా వెల్లడించింది. ఎంజీ విండ్సర్ ఈవీకి 38 కిలోవాట్ అవర్, 52.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో ఈ కారు సుమారు 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఎంజీ చెబుతోంది. ధరల విషయానికి వస్తే, మహీంద్రా XUV 3XO EV ప్రారంభ వేరియంట్ AX5 ధర రూ. 13.89 లక్షలు. టాప్ వేరియంట్ AX7L ధర రూ. 14.96 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు, ఫీచర్లు, బ్రాండ్ నమ్మకంతో XUV 3XO EV భారత ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.