Mahesh : ఈనాడు సంస్థల అధినేత అయిన చెరుకూరి రామోజీరావు గారు (87) తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇటీవలే ఆయన గుండెకు వైద్యులు స్టంట్స్ కూడా వేశారు. వయసు రీత్యా ఆయన పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన.. చికిత్స పొందుతూ మరణించారు. రామోజీరావు పార్థీవదేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. రామోజీరావు మృతిపట్ల సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Read Also :Ramoji Rao: బతికి ఉండగానే స్మారకం.. ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు!
రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో ఆయన జన్మించారు. గుడివాడలో బీఎస్సీ డిగ్రీ అక్కడే పూర్తి చేశారు. ఈనాడు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, మరియు పలు వ్యాపార సంస్థల అధినేతగా రామోజీ రావు వున్నారు.రామోజీ రావు జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఆయన ఎన్నో సినిమాలని నిర్మించారు.. ఎందరో నటినటులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు రామోజీరావుకు నివాళులర్పించారు.ఎంతో దూర దృష్టి గల రామోజిరావు గారి మరణ వార్త నన్ను కలచి వేసింది..రామోజీ ఫిలిం సిటీ సినిమాపై ఆయనకున్న ఇష్టానికి నిదర్శనం.ఆయన ప్రస్థానం మనకు ఎప్పటికి స్ఫూర్తిని ఇస్తుంది.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మహేష్ ట్వీట్ చేసారు.
Deeply saddened by the passing of Ramoji Rao Garu, a visionary always ahead of his time. Ramoji Film City is a testament to his brilliance and passion for cinema. His legacy will continue to inspire us all. My thoughts and prayers are with the family and loved ones. May his soul…
— Mahesh Babu (@urstrulyMahesh) June 8, 2024