ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. నిత్యం వంటల్లో ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించడం సహాజం. శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు, కానీ ప్రతి భారతీయ వంటగదిలో ఒక సాధారణ పదార్ధం ఉల్లిపాయ. అవును, మీరు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉల్లిపాయలను చూస్తారు. కొందరు పప్పులో, ఎక్కువ మంది కూరగాయల రుచిని పెంచడానికి ఉల్లిపాయలను ఉపయోగిస్తారు… ఉల్లిపాయలు లేకుండా ఆహారం అసంపూర్ణంగా అనిపిస్తుంది. . అయితే అలాంటి ఉల్లినే భారతదేశంలోని ఓ ప్రాంతంలో బ్యాన్ చేశారన్న విషయం మీకు తెలుసా.
Read Also: Youth Arrested: చోరీలు చేస్తూ తెలంగాణలో పట్టుబడ్డ ఎపీకీ చెందిన యువకుడు
జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రా పట్టణంలో ఉల్లిపాయలను పూర్తిగా నిషేధించారు. ? కాట్రా పట్టణం మతపరంగా చాలా ముఖ్యమైనది. మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. అయితే అమ్మవారి పవిత్రతనను కాపాడేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మతపరమైన వాతావరణం, పవిత్రతను కాపాడుకోవడానికి, ఇక్కడి పరిపాలనా యంత్రాంగం ఉల్లిపాయలు, వెల్లుల్లిపై పూర్తి నిషేధం విధించింది.
Read Also: Groom Missing: రెండు రోజుల్లో పెళ్లి.. కనిపించకుండా పోయిన వరుడు.. అసలేమైందంటే..
కాట్రా నగరంలోని ఏహోటల్ లేదా రెస్టారెంట్‌లో కూడా ఉల్లిపాయ లేదా వెల్లుల్లితో చేసిన వంటకాలు మీకు దొరకవు. ఒక వేళ మీరు అడిగితే.. మిమ్మల్ని చీడ పురుగును చూసినట్లు చూస్తారు. అయితే ఇక్కడ దొరికే ఆహారం మాత్రం చాలా బాగుంటుందని భక్తులు చెబుతున్నారు. ఈ సంప్రదాయం కొనసాగించడం కోసం ఇండ్లలో కూడా ఉల్లి, వెల్లుల్లిని నిషేధించినట్టు స్థానికులు వెల్లడించారు. మాతా వైష్ణో దేవి పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడి దుకాణదారులు తెలిపారు.