Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ లేదు!
- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ స్థాపించినా, పాదయాత్ర చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టే పాదయాత్రను తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రతి రాజకీయ కార్యక్రమాన్ని ఆదరిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ లేదు అని మహేష్ కుమార్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ పేరు మార్చినా, కొత్త పేర్లతో వచ్చినా వచ్చే ఎన్నికల్లో అధికారం మాత్రం కాంగ్రెస్‌దే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసినా ప్రజలు తమ వెంటనే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు గట్టి పోటీదారులే లేరన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ కాలంలో రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని, ముఖ్యంగా సింగరేణిలో జరిగిన ఒప్పందాలు అన్నీ గత ప్రభుత్వ కాలంలోనే జరిగాయని పేర్కొన్నారు. సింగరేణిలో జరిగిన అవినీతిని కార్మికులు ఎప్పటికీ మరిచిపోరని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
Also Read: SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్‌వుడ్ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!
బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం లేదని టీపీసీసీ చీఫ్ అన్నారు. కల్వకుంట్ల కవితకు ఫండింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. పోచారం చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండటం సహజమని తెలిపారు. పోచారం పెద్ద మనసుతో పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా సుమారు 7 వేల కోట్ల రూపాయల అప్పులు కాంగ్రెస్ చెల్లిస్తోందని, అయినప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
- Tags
- BRS
- congress
- Congress Vs Brs
- Kavitha
- ktr
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?