NTV Telugu Site icon

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి కారణం అదే..

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు.” కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరె కటికల పాత్ర ఉంది. బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడొ యాత్ర చేపట్టారు. బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కుల సర్వే జరగాలనేది రాహుల్ గాంధీ ఆశయం. కుల సర్వే తో బీసీల గుండెల్లో రాహుల్ గాంధీ గారు చిర స్థాయిగా నిలిచిపోతారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రేవంత్ ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించింది. రానున్న ఎన్నికల్లో ఆరె కటికలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆరె కటికలకు అండగా ఉంటుంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఆరె కటికలు ఎదగాలి. భవిష్యత్ తెలంగాణ బీసీలదే. 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్దత కోసం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది.” అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

READ MORE: Narendra Modi : భోజ్ పురిలో మాట్లాడిన మోడీ.. ఆ వంటకం గురించి స్పెషల్ కామెంట్

పదేళ్ల పాలనలో కేసిఆర్ ప్రభుత్వం బీసీ లకు చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. “కాంగ్రెస్ పాలనలో బీసీలకు సువర్ణ అధ్యాయం. బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. పదేళ్లలో కేసిఆర్ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మాటకు కట్టుబడి ఒక్కొకటిగా అమలు చేస్తుంది. ఆరె కటిక కార్పొరేషన్ కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నా. ఆరె కటికలను BC -D నుంచి BC- A డిమాండ్ పై చర్చిస్తాం. బీసీ బిడ్డ బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి..లాక్కుంది ఎవరు? తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే కుల సర్వేకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని అడగగలరా? దేశ వ్యాప్తంగా జన గణన తో పాటు కుల సర్వే చేయాలని అడిగే ధైర్యం బండి సంజయ్ కి ఉందా? ” అని మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించా