Mahesh Babu To Attend Anant Ambani and Radhika Merchant Marriage: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్‌లో జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ల వివాహం నేడు కన్నుల పండగగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదిక. అనంత్-రాధిక పెళ్లి కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, నటీనటులు అతిథులుగా వచ్చారు. దాంతో జియో వరల్డ్ సెంటర్ మొత్తం సందడిగా మారింది.
Also Read: Nithiin Look: అయ్య బాబోయ్.. నితిన్ ఏంటి ఇలా మారిపోయాడు! షాకింగ్ లుక్ వైరల్
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక కోసం గురువారమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబంతో కలిసి వెళ్లాడు. ఈరోజు ఉదయం ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు వెళ్లాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సతీమణి నమ్రత, కూతురు సితారతో కలిసి సూపర్ స్టార్ కనిపించారు. మహేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ న్యూలుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. లాంగ్ హెయిర్, గడ్డంతో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి లండన్, జర్మనీకి వెకేషన్‌కు వెళ్లిన మహేష్.. రెండు రోజుల క్రితమే ఇండియా తిరిగొచ్చాడు.
Superstar @UrstrulyMahesh sets off to Mumbai to attend the Grand Wedding of Ananth Ambani ❤️🔥#MaheshBabu #SSMB pic.twitter.com/cPmPxTLrjL
— Mahesh Babu Space (@SSMBSpace) July 12, 2024