Nithiin Old Look Goes Viral From Robinhood Set: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నితిన్ వృద్ధుడి గెటప్‌లో ఉన్నాడు. షాకింగ్ గెటప్‌లో నితిన్ అందరికీ హాయ్ చెప్పాడు. మరోవైపు శ్రీలీల కూడా వృద్ధురాలిగా కనిపించారు. రాబిన్ హుడ్ 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటాడు అంటూ వెంకీ కుడుముల కామెంట్ చేశాడు. మరి ఆ గెటప్‌లు ఫేస్ యాప్ ద్వారా చేశారా?.. లేదా సినిమాలో ఇలా కనిపిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. షూటింగ్ సెట్‌లోనిది ఈ దృశ్యం. నితిన్ గెటప్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘బాబోయ్.. నితిన్ ఏంటి ఇలా మారిపోయాడు’, ‘షాకింగ్ లుక్ ఇది’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Aparna Vastare Death: ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం!
నితిన్‌కు ఇటీవలి కాలంలో సరైన హిట్ లేదు. భీష్మ, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భీష్మ పర్వాలేదనిపించగా.. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ భారీ ఫ్లాఫులుగా నిలిచాయి. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వెంకీ కుడుములతో సినిమా చేస్తున్నాడు. రాబిన్ హుడ్‌పై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ చేస్తున్న విషయం తెలిసిందే.
Pulling each other’s legs is our daily routine on #Robinhood sets..@actor_nithiin anna & @sreeleela14 😂🙈 pic.twitter.com/pTp4yiO32o
— Venky Kudumula (@VenkyKudumula) July 11, 2024