Mahesh Babu’s Guntur Kaaram Movie Making Video Out: ‘గుంటూరు కారం’ సినిమాతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్‌తో తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత బాబు మాస్ లుక్‌లో కనిపించనుండడంతో.. ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చూస్తున్నారు. ఎప్పుడు ప్రీమియర్లు షోలు పడుతాయా? అని మహేష్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు మరికొంత సమయం ఉండడంతో.. ఈ గ్యాప్‌లో చిత్ర యూనిట్ మరో అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషి చేసింది.
గుంటూరు కారం సినిమా నుంచి మేకింగ్ వీడియోను కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదల చేశారు. మేకింగ్ ఆఫ్ గుంటూరు కారం పేరిట ఈ వీడియో విడుదల అయింది. సినిమాను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వర్క్ ఈ వీడియోలో కనిపిస్తుంది. శ్రీలీల, త్రివిక్రమ్ నవ్వులు.. మహేష్ బాబు డైలాగ్స్, ఫైట్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. బాబు చాలా స్టైలిష్‌గా, ఇదివరకెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ఏంటి అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా అనే డైలాగ్ అదిరిపోయింది.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు: హీరోయిన్
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి నాయికలుగా నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం ఈ సినిమా నుంచి విడుదల అయిన ట్రైలర్‌తో పాటు సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.