Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు హీరోగా రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అడ్వెంచర్ ఎపిక్ ‘వారణాసి’. ఈ చిత్రాన్ని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) విలన్‌గా నటిస్తుండగా, ఆర్. మాధవన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ పై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ వారణాసి సెట్‌లో మహేష్ బాబు (రుద్ర), ప్రియాంక చోప్రా (మందాకిని)లపై కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. అయితే సమాచారం ప్రకారం..
Also Read : Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!
Also Read
ఈ షెడ్యూల్ ముగియగానే ఒక గ్రాండ్ సాంగ్ షూటింగ్ జరగనుందని, అందులో మహేష్ బాబు సరసన నటించేందుకు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రియాంక చోప్రా తన పాత్ర కోసం ఒక అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ఉండాలని కోరగా, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇక హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం అంటార్కిటికా వంటి లొకేషన్లలో కూడా షూటింగ్ జరిపిన జక్కన్న, ఈ స్పెషల్ సాంగ్‌ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దబోతున్నారట. ఏప్రిల్ 7, 2027న ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?