Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వరుస విజయాలను అందుకుంటున్నారు. అయితే ఆయనలో కేవలం గొప్ప దర్శకుడే కాకుండా ఒక అద్భుతమైన నటుడు కూడా ఉన్నాడని నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. అనిల్ రావిపూడిని నటుడిగా తానే వెండితెరకు పరిచయం చేస్తానని స్పష్టం చేశారు. గతంలో అనిల్ కథలు వినిపించడానికి తన వద్దకు వచ్చినప్పుడల్లా ఆయనలోని నటుడిని గమనించానని, అందుకే ఆయన్ని హీరోగా పెట్టి ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన తనకు ఉందని దిల్ రాజు వెల్లడించారు.
Also Read : Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘#VenkyAnil5’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలో అనిల్ నటుడిగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు, ప్రదీప్ రంగనాథన్ కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం ఏప్రిల్ 10న తెలుగులో విడుదల కాబోతోంది. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్‌లో మంచి మార్కెట్ సంపాదించుకున్న ప్రదీప్, ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సై-ఫై కామెడీ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!