టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య మహేష్ కు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారుతున్నారు.. ఇటీవల మహేష్ శేర్ చేసిన ప్రతి లుక్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ హీరోలలో బెస్ట్ హ్యాండ్సమ్ లుక్స్ కలిగిన వారిలో మహేష్ కూడా ఒకరు.. అంత అందంగా ఉన్నాడని ఫోటోను చూస్తే తెలుస్తుంది..
ఇక ఒకవైపు క్లాస్ లుక్స్ తోనే కాక మరొకవైపు మాస్ లుక్కుతో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు ప్రిన్స్. తాజాగా మరొకసారి స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ లో మహేష్ బాబును చూసిన ఫ్యాన్స్ ఎంత అందంగా ఉన్నాడో కదా అంటూ ఆ ఫోటోలను తెగ లైక్ చేచున్నారు.. స్టైలిష్ సూట్ లో మహేష్ బాబు నెవర్ బిఫోర్ అనేలా అట్రాక్ట్ అయితే చేస్తున్నాడు. కొత్త లుక్ లో మహేష్ అదిరిపోతున్నాడు.. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. గుంటూరు కారంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇకపోతే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఇక మిగతా షూటింగ్ డిసెంబర్ మొదటి వారానికి ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ దసరాకు మొదటి లిరికల్ సాంగ్ విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.. ఏది ఏమైనా మహేష్ న్యూ లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది..