MP Sanjay Raut : మరో 15రోజుల్లో మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో కీలక నేతగా ఉన్న సంజయ్ రౌత్.. ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని.. సుప్రీంకోర్టు ఆదేశాల కోసమే ఎదురు చూస్తున్నామన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విషయంపై సంజయ్ రౌత్ మాట్లాడారు.
Read Also : Bandi Sanjay : రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్
‘‘ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే.. ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15-20 రోజుల్లో కూలిపోతుంది. ఈ ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయింది. దానిపై ఎవరు సంతకం చేయాలనేది ఇప్పుడే నిర్ణయించాలి’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాగా.. ఫిబ్రవరిలోనే షిండే ప్రభుత్వం కూలిపోతుందని సంజయ్ రౌత్ గతంలో కూడా చెప్పారు. గత ఏడాది జూన్ లో ఏక్ నాథ్ షిండే.. 39 మంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేశారు, ఫలితంగా పార్టీ రెండు భాగాలుగా చీలిపోయింది. థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత షిండే బీజేపీతో పొత్తు పెట్టుకొని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022 జూన్ 30వ తేదీన షిండే సీఎంగా, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: Etela Rajender : వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడు…