Bangalore Airport: తనిఖీ పేరుతో దుస్తులు విప్పించారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Says She Was Strip Searched At Bengaluru Airport: తనిఖీ పేరుతో బెంగుళూరు ఎయిర్‌పోర్టులో తన చొక్కా విప్పించారని కృషాని గాధ్వి అనే ఓ మహిళ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఒక మహిళ అని చూడకుండా, భద్రతా తనిఖీల సమయంలో తనతో బలవంతంగా దుస్తులు తొలగించారని.. ఈ ఘటన తనని తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. ఆ దారుణ పరిస్థితుల్లో తాను లోదుస్తుల్లో నిల్చోవాల్సి వచ్చిందని, ఇది తనకు చాలా అవమానకరమని తెలిపింది. ఒక మహిళగా ఎలాంటి పరిణామాలైతే ఎదురవ్వకూడదని కోరుకుంటామో, అలాంటి ఘోర పరిస్థితి తనకు ఎయిర్‌పోర్టులో ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు మహిళతో చొక్కా విప్పించాల్సిన అవసరం ఏముందంటూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని ప్రశ్నించింది.
ఈ విధంగా కృషాని చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆమెకు మద్దతుగా బెంగుళూరు ఎయిర్‌పోర్టు సిబ్బందిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బెంగళూరు ఎయిర్‌పోర్టు.. సెక్యూరిటీతో మాట్లాడి, ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి మళ్లీ ఎలాంటి స్పందన రాలేదు. సెక్యూరిటీ టీమ్ సీఐఎస్ఎఫ్‌కు సంబంధించిన వారు కాబట్టి, వారిపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపింది. దీనిపై సీఐఎస్ఎఫ్ బృందమే తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే, కృషాని గాధ్వి చేసిన ఆరోపణలు అవాస్తవమని బీజేపీ లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్ పేర్కొన్నారు. ఒక మహిళా సిబ్బంది పర్యవేక్షణలోనే ఆమెని తనిఖీ చేసినట్లు వెల్లడించారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
‘‘బెంగళూరు ఎయిర్‌పోర్టులో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా విప్పించారని ఒక మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవం. ఆమె బ్యాడ్జీలు, బీడింగ్‌లతో కూడిన డెనిమ్ జాకెట్ ధరించింది. ఒక మహిళా సిబ్బందితో ప్రైవేట్‌గా పరీక్షించబడింది’’ అంటూ పీసీ మోహన్ ట్వీట్ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? కృషాని గాధ్వి ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత తన అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసింది. దీంతో.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కేవలం అటెన్షన్ పొందడం కోసం ఆ ట్వీట్ చేసిందా? లేక ఎవరైనా అకౌంట్ డీయాక్టివేట్ చేయించారా? అనేది మిస్టరీగా మారింది. చూస్తుంటే, కేవలం ఆన్‌లైన్‌లో పబ్లిసిటీ పొందడం కోసమే ఆ యువతి ఆ పని చేసినట్టుగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Claims of a woman asked to remove her shirt during a security check at the #Bengaluru airport are false.
The woman was wearing a denim jacket with badges and beadings.
She was frisked privately with a female companion present, according to @CISFHQrs sources.@BLRAirport pic.twitter.com/H8n1aPVAQV
— P C Mohan (@PCMohanMP) January 4, 2023
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!