Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం తమ వ్యక్తిగత జీవితాలను, సంపదను ప్రదర్శించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ఒక యూట్యూబర్ చేసిన ఇలాంటి ప్రయత్నమే ఆమె ఇంట్లో భారీ దోపిడీకి దారితీసింది. రచనా గుర్జర్ అనే గృహిణికి యూట్యూబ్‌లో ఒక లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవల తన విలాసవంతమైన జీవనశైలిని చూపిస్తూ తన ఇంట్లోని వివిధ గదులను, తలుపులను, భద్రతా ఏర్పాట్లను ‘హోమ్ టూర్’ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాకుండా.. మరో వీడియోలో తన వద్ద ఉన్న భారీ బంగారు, వెండి ఆభరణాలను, నగదును ఒక టేబుల్‌పై పెట్టి మరీ ప్రదర్శించారు. ఈ వీడియోలే దొంగలకు రోడ్‌మ్యాప్‌గా మారాయి.
శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో, గుర్తుతెలియని దొంగలు మోహని గ్రామంలోని రచనా గుర్జర్ ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులను బయట నుండి ఒక గదిలో బంధించారు. ఆపై ఇంట్లోని రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి నగదు, కొంత నగదుతో పాటు ఒక ఎనర్జీ డ్రింక్ కార్టన్‌ను కూడా దొంగిలించారు. తమ గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు, ఒక లాఠీ సహాయంతో ఇంట్లోని సిసిటివి కెమెరాల కోణాలను మార్చేశారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచిన కుటుంబ సభ్యులు, గది బయట నుండి లాక్ చేసి ఉండటాన్ని గమనించి బంధువులకు ఫోన్ చేశారు. వారు వచ్చి తలుపులు తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు నర్వార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలు స్థానికులే అయ్యుంటారని, యూట్యూబ్ వీడియోల ద్వారా ఇంటి లోపలి విషయాలను పూర్తిగా తెలుసుకొని పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో మితిమీరిన వ్యక్తిగత వివరాల ప్రదర్శన ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక హెచ్చరిక.
తాజావార్తలు
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
-
Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!