Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- పెళ్లికి ముందు అవివాహిత పెద్దల మధ్య శారీరక సంబంధం తప్పుకాదు..
- ఇద్దరి అంగీకారంతో ఉన్న సంబంధాన్ని తప్పుపట్టలేము..
- తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పెళ్లికి ముందు ఇద్దరు అవివాహితైన మేజర్ల మధ్య పరస్పర సమ్మితితో శారీరక సంబంధం ఏర్పడితే దానిని తప్పుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడించింది. ఇది ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి మచ్చగా చెప్పలేమని వ్యాఖ్యానించింది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ మన్మోహన్, జస్టిన్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
2014లో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకం సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తెలంగాలలో గాజుల తిరుపతి అనే వ్యక్తి ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికవ్వగా, 2014లో ఒక మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడనే కారణంగా అతడికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ కేసులో అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. దీని తర్వాత 2015లో ఈ కేసు లోక్ అదాలత్‌లో రాజీకి వచ్చింది. ఈ కేసు కారణంగా తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతడి కానిస్టేబుల్ ఎంపికను రద్దు చేసింది.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు అవివాహిత పెద్దలు తమ ఇష్టప్రకారం సంబంధం కొనసాగించడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. కేవలం అలాంటి సంబంధం కారణంగా వ్యక్తి నైతికత, వ్యక్తిత్వాన్ని ప్రశ్నించలేమని చెప్పింది. ప్రతీ ప్రేమ సంబంధం కూడా వివాహంతోనే ముగియాల్సిన అవసరం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. పెళ్లి కానంత మాత్రాన సంబంధంలో మోసం చేశాడని భావించలేమని చెప్పింది. లోక్ అదాలత్‌లో రాజీకి రావడం అంటే నేరాన్ని అంగీకరించినట్లు కాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో ఇద్దరు కూడా ఒకరికి ఒకరు తెలుసని, పొరుగువారని కోర్టు గమనించింది. బలవంతంగా, బెదిరించి, ఒత్తిడి చేసి రిలేషన్ కొనసాగించారనే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తగిన ఆధారాలు లేకుండా వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం సరికాదని పేర్కొంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!