UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UCC Bill: మధ్యప్రదేశ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే యూసీసీ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అయితే, కట్ని జిల్లాలో జరిగిన ఒక పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. “రాష్ట్రంలో ఒక్క పెళ్లి చేసుకున్న వారికి మాత్రమే చట్టబద్ధంగా నివసించే హక్కు ఉంటుంది” అని సీఎం వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే అధిపతి, ఒకే జెండా ఉన్నప్పుడు హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. “రాముడు ఒకే పెళ్లి చేసుకున్నప్పుడు.. రహీమ్‌కు రెండు, మూడు, నాలుగు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలి? ముస్లిం మహిళలు సైతం మన సోదరీమణులే. ప్రతిపాదిత యూసీసీ చట్టం ప్రకారం.. ఒక్క వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే మధ్యప్రదేశ్‌లో ఉండే చట్టపరమైన హక్కు ఉంటుంది” అని మోహన్ యాదవ్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత చట్టాల ప్రకారం తక్షణ త్రిబుల్ తలాక్‌కు ఎంతమాత్రం తావులేదని, ఎవరైనా ‘తలాక్, తలాక్, తలాక్’ అంటే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. భోపాల్‌లోని జగదీష్పూర్లో జరగబోయే తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి, ఆపై అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందూ-ముస్లింల పేరుతో సమాజాన్ని విభజించిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. సీఎం మోహన్ యాదవ్ తన పోలిక కోసం ‘రామ్’, ‘రహీమ్’ వంటి పవిత్రమైన పేర్లను ఉపయోగించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్ల పేర్లను వాడుకోవడం ముఖ్యమంత్రి ఆలోచనా ధోరణి దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. “యూసీసీ గురించి మాట్లాడుతూ కేవలం వివాహాల గురించే ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. మరి ఇదే విషయాన్ని మన దేశంలోని గిరిజన తెగలకు ఆయన చెప్పగలరా? భారత రాజ్యాంగం కొన్ని గిరిజన వర్గాలకు బహుభార్యత్వాన్ని అనుమతించిందనే విషయం ఆయనకు తెలియదా? వారి హక్కులను కూడా లాగేసుకోవాలని చూస్తున్నారా?” అని హఫీజ్ ప్రశ్నించారు. యూసీసీ పేరుతో బీజేపీ కేవలం ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!