తరుచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇరుకైన ప్రదేశాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు.. వాటిని నియంత్రించేందుకు ఫైర్ సిబ్బందికి చాలా టైం వెస్ట్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో అగ్నిమాపక దళాలకు సాయంగా పనిచేసే రోబోను ఓ యువకుడు తయారు చేశాడు. అయితే, ఆ రోబో మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొస్తుంది.
Read Also: Lord Ganesh Remedies: బుధవారం వినాయకుడికి ఈ పరిహారాలు చేస్తే.. అదృష్టం, సంపద మీ వెంటే!
మధ్యప్రదేశ్‌లోని ఇండౌర్‌కు చెందిన 21 ఏళ్ల మనుజ్ జైశ్వాల్ అనే యువకుడు మంటలను అదుపు చేసేందుకు ఓ మినీ రోబోను తయారు చేశాడు. ఇరుకైన వీధులు, ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు.. వాటిని నియంత్రించడం చాలా కష్టమవుతుంది. అలాంటి ప్రదేశాలకు అగ్నిమాపక యంత్రాలను తీసుకెళ్లడం చాలా శ్రమతో కూడుకుంది. అలాంటి సమయాల్లో ఈ రోబో వినియోగంతో మంటలను సులువుగా అదుపులోకి తేవచ్చని మనుజ్ జైశ్వాల్ చెప్పారు. ఫైర్ సిబ్బందికి ప్రమాదాలు కూడా తగ్గుతాయని అతడు పేర్కొన్నాడు. ఇది చూడటానికి రిమోట్ కారులా ఉండే ఈ రోబోకు పైన కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్‌ను జైశ్వాల్ పెట్టాడు. దాన్ని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసేలా జైశ్వాల్ డిజైన్ చేశాడు.
Read Also: SIM Cards: ఏంటి మావా ఇన్ని వాడేవా!.. 658 సిమ్ కార్డులు ఎలా?
అయితే, ఈ రోబో ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందనీ ఈ యంత్రాలనే పెద్దగా తయారు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటాయని జైశ్వాల్ వెల్లడించాడు. ప్రస్తుతం జైశ్వాల్ ఆటోమేషన్ రోబోటిక్స్‌లో ఇంజనీరింగ్‌ను చదువుతున్నాడు. ఈ రోబోతో మంటలను ఆర్పడం మాత్రమే చేయగలమనీ.. అయితే కృత్రిమ మేథతో పనిచేసే రోబో తయారు చేసి.. అగ్ని ప్రమాదాలు నివారించడం గురించి ఆలోచిస్తున్నానని అతడు పేర్కొన్నాడు. ఇలాంటి రోబోల తయారీకి పేటెంట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాట్లు తెలిపాడు. త్వరలో ఇన్వెస్టర్ల సాయంతో పెద్ద ఎత్తున వీటిని ఉత్పత్తి చేస్తానని జైశ్వాల్ వెల్లడించాడు.