మీర్‌పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. డీఎన్‌ఏ రిపోర్టు పోలీసుల వద్దకు చేరుకుంది.. మాధవిని తన భర్త హత్య చేసి ముక్కలుగా నరికి.. ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు.
ఇటీవల హైదరాబాద్ మీర్ పేటలో మహిళ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భార్యను అతి కిరాతకంగా చంపి మృగంలా ప్రవర్తించాడు భర్త. వెంకట మాధవిని చంపి, ముక్కలు చేసి కుక్కర్ లో ఉడకబెట్టి ఆ తర్వాత పొడి చేసి చెరువులో కలిపేశాడు భర్త గురుమూర్తి. ఈ దారుణ ఘటన పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికే గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. అయితే ఈ హత్య కేసులో సంచలన విషయాలు…